ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు చేస్తూ సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లాలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న 56 సంవత్సరాల బీహార్ వలస కార్మికుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పుని వెలువరించింది. చిన్నారి తల్లితండ్రులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన 11 నెలలలోపే తీర్పు వచ్చింది. సంగారెడ్డి కోర్టు పరిధిలో ఉరిశిక్ష విధించడం 27 సంవత్సరాల తర్వాత… ఇదే మొదటిసారి.
బీహార్ రాష్ట్రానికి చెందిన గఫార్ అలీ(56) గత సంవత్సరం బీడీఎల్ బానూరులో ఐదేళ్ల బాలికకు కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో హత్య చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.నిందితుడిపై నేరాభియోగానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంతో గఫార్‌కు మరణ దండన విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, ఈ ఘటన జరిగి 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించారు.
కేసు వివరాలలోకి వెళితే..బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చైతన్య కంపెనీ లో పనిచేసే దంపతుల ఐదేళ్ల కుమార్తెను సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు. వీరి రూమ్ ప్రక్క రూంలో ఉండే నేరస్తుడు గఫాఫర్ అలీ అక్టోబర్ 16, 2023 నాడు పనికి వెళ్ళకుండా మద్యం సేవించి ఉన్నాడు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప కనిపించగా పాప తెలుసని చెప్పి తీసుకెళ్లాడు.చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక కోసం సాయంత్రం అంతటా వెతికిన తల్లితండ్రులు… చివరికి చిన్నారి శవాన్ని పత్తి చేనులో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి… నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…