KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్‌గా కేటీఆర్ తన ట్విట్టర్‌లో మీరు గూండాయిజం, దౌర్జన్యం చేసిన కూడా మీ కాంగ్రెస్ గూండాలకి బీఆర్ఎస్ దళం భయపడదు. తెలంగాణలోని ప్రతి అంగుళం మేము కాపాడుకుంటాం అంటూ కేటీఆర్ అన్నారు. మీరు చేసే ప్రతి పని మమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బలంగా నిలబడండి, మీ వెనక మేము ఉన్నామంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో తెలియజేశారు. మరోవైపు రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.
రైతు రుణమాఫీ పేరుతో వారిని వంచనకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన రేవంత్.. మాట తప్పటంతో పాటు అర్హులకు రుణమాఫీ చేయకుండా వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం. కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి ? ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి ? అని కేటీఆర్ అన్నారు.
హైడ్రా పేరిట నిరుపేదల ఇండ్లను కూలగొడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇండ్ల మీదకు వెళ్లినట్లు.. మీ అన్న తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.ఉన్న ఒక గూటినీ మీ బుల్డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్ళతో కిరసనాయిలు పోసుకున్నందుకు కేసులు పెడతారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటు, ఎంతటి నీతిమాలిన చర్య, మీది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కాదు రేవంత్ రెడ్డి, మీరు నడుపుతున్నది బుల్డోజర్ ప్రభుత్వం! కేసుల రాజ్యమంటూ తీవ్ర స్థాయిలో ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…