ఛత్తీస్‌గఢ్ హైకోర్టు షాకింగ్ తీర్పు.. భార్యతో బలవంతంగా చేస్తే అది అత్యాచారం కాదు..

August 26, 2021 9:04 PM

భార్య, భర్త మధ్య దాంపత్య విషయంలో భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేస్తే అత్యాచారం కాదని తాజాగా ఛత్తీస్ గఢ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక వేళ భార్య వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే మాత్రం అత్యాచారమే అన్నట్లు తెలిపింది. తనపై భర్త అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయగా ఆ కేసును కోర్టు విచారించింది. దీంతో ఆ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలతో తీర్పునిచ్చింది.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు షాకింగ్ తీర్పు.. భార్యతో బలవంతంగా చేస్తే అది అత్యాచారం కాదు..

బెమెతారా జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త ఇష్టం లేకుండా శృంగారం చేస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని, అతని కుటుంబ సభ్యులు కూడా వరకట్న వేధింపులు చేస్తున్నారని కేసు నమోదు చేసింది. దీంతో భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ఈ కేసు గురించి ఛత్తీస్ గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కే చంద్ర వంశీ కొన్ని విషయాలు తెలిపారు.

18 ఏళ్ళ కంటే వయస్సు ఎక్కువగా ఉన్న భార్యతో ఇష్టం లేని శృంగారం చేసినా అత్యాచారం కాదని తెలిపారు. కానీ తనను భర్త శారీరకంగా, లైంగిక అవయవ భాగాలలో పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాడని తెలపడంతో.. వెంటనే కోర్టు అసహజమైన శృంగారం చేయడం నేరమని తెలిపింది. ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధానికి ఇబ్బందులు కలిగించే విధంగా చేయడం నేరమే అని అతడిపై కేసు నమోదు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment