దారుణం: స్నేహితురాలితో కలిసి లంచ్ చేస్తున్న యువతి.. తుపాకితో కాల్చి చంపిన యువకుడు!

July 31, 2021 6:51 PM

సరదాగా మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్న ఒక దంత వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న యువకుడు ఈ విధంగా వైద్య విద్యార్థినిపై తుపాకీ కాల్పులు జరిపి చంపిన ఘటన కేరళ ఎర్నాకుళంలోని కొత్తమంగళం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కన్నూర్‌ జిల్లా తలస్సేరి ప్రాంతానికి చెందిన మానస అనే యువతి  కొత్తమంగళంలోని ఇందిరా గాంధీ డెంటల్ కాలేజ్‌లో వైద్య విద్యార్థిని. ఈ క్రమంలోనే ఆమె తన కాలేజీకి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన స్నేహితురాళ్లతో కలిసి ఉంటుంది.తలస్సేరి ప్రాంతానికి రాఖిల్ అనే యువకుడు తరచూ తన వెంటపడుతూ తనని మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు రాఖిల్ ను వదిలిపెట్టారు. అయితే తనకు జరిగిన అవమానం పై పగ తీర్చుకోవాలని భావించిన రాఖిల్ నెల రోజుల నుంచి మానస ఉంటున్న ఇంటి పరిసరాలలోని తిరుగుతూ ఆమె కదలికలపై నిఘా పెట్టాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో మానస, తన స్నేహితురాలితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటిలోనికి రాఖిల్ ప్రవేశించడంతో మానస అభ్యంతరం వ్యక్తం. ఈ క్రమంలోనే ఆ యువకుడు లోపలికి తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఇంతలో మానస స్నేహితురాలు విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాలని పరుగులు పెట్టగానే ఇంటి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి చూడటంతో మానస, రాఖిల్ తుపాకితో కాల్చుకుని మరణించారు. రాఖిల్ మొదట మనసును తుపాకితో కాల్చి తనూ కాల్చుకున్నట్టు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న మానసును ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు మిగలలేదు.ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టం తరలించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment