అల్లుఅర్జున్ తో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్లు.. ఎవరంటే?

August 18, 2021 10:22 PM

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రంలో “పుష్ప” అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు అల్లు అర్జున్ తో మాట్లాడగా ఈ సినిమాకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించడం కోసం మొదట్లో కియారా అద్వానీ, అలియా భట్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమాలో నటించడం కోసం హీరోయిన్ అనన్య పాండే, శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరో ఒకరు అల్లు అర్జున్ “ఐకాన్” సినిమాలో నటించబోతున్నారనే సమాచారం ఇండస్ట్రీలో వినబడుతుంది. అనన్య పాండే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న “లైగర్” సినిమాలో నటిస్తోంది. జాన్వీ కపూర్ పలు బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి అల్లు అర్జున్ “ఐకాన్” సినిమాలో ఏ హీరోయిన్ కి అవకాశం వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now