మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. ఈ క్రమంలోనే అటు వెండి తెర వైపు మాత్రమే కాకుండా ఇటు ఓటీటీల్లో అవకాశాలను కొల్లగొడుతూ ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫోటో, తెలిపిన సమాచారం పెద్ద ఎత్తున నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి తమన్నా దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇది ఒక కుకింగ్ షో, ఇంకా షూటింగ్ ప్రారంభం కాకనే ఈ విధంగా ఎంజాయ్ చేశామంటూ తమన్నా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో విజయ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బుల్లితెరపై తమన్నా హోస్ట్ గా ఓ కుకింగ్ ప్రోగ్రాం రాబోతుంది అనే విషయం మనకు తెలిసిందే.
మాస్టర్ చెఫ్ అంటూ జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి, తమన్నా ఒకే చోట చేరి సందడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాల పరంగా తీరిక క్షణం లేకుండా ఉండే విజయ్ సేతుపతి ఈ విధంగా ఓ వంటల ప్రోగ్రామ్ కి రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తానికి వీరిద్దరూ కలిసి చేసే ప్రోమో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…