నా భార్య కులం.. ఆ హీరో వల్ల బయట పడింది: రాజమౌళి తండ్రి

June 5, 2021 2:42 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి రచయిత. ఆయన కలం పట్టి కథ రాస్తే ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి పోవాల్సిందే. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో కథలను రాసిన విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ తో ఇంటర్ వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం తన కొడుకు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన కొన్ని ఫైట్స్, కొన్ని సీన్లను చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. తన వివాహం ప్రేమ వివాహమని. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్లి తర్వాత కూడా ఏ కులం అనే విషయం తనకు తెలియదని ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

పెళ్లి తర్వాత కొన్ని రోజులకు తన భార్య కులం ఏమిటో మెగాస్టార్ చిరంజీవి ద్వారా తెలిసిందని ఆయన తెలిపారు. ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ భార్య చిరంజీవిని ఉద్దేశించి మా చిరంజీవి… మా చిరంజీవి అని సంబోధించడంతో ఎందుకు ఎప్పుడు మా చిరంజీవి అని అంటావు అని అడగగా.. అప్పుడు తెలిసింది తన భార్య కులం ఏమిటి అనేది.వీళ్ళ ఇద్దరిదీ ఒకే కులం కావడంతోనే చిరంజీవిని మా చిరంజీవి అని పిలిచేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే ఆమె రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్ర విజయాన్ని చూడకనే తన భార్య కన్నుమూశారని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now