దక్షిణాది సినీ హీరోయిన్ నటి ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి ఆదరణ దక్కించుకుంది. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ మంచి విజయాలు దక్కడం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలలో నటించిన ప్రణీత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.
తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపే ప్రణీత తన జీవితంలోఎంతో ముఖ్యమైన పెళ్లి విషయం గురించి అభిమానులతో పంచుకోలేదు.ఈ క్రమంలోనే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రణీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఒక్కసారిగా ప్రణీత పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రణీత పెళ్లి గురించి ఏ విధమైనటువంటి ప్రకటన లేకుండానే పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ప్రణిత ఎట్టకేలకు తన పెళ్లి పై స్పందించారు. ఈ క్రమంలోనే అభిమానులను ఉద్దేశించి ప్రణీత చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రణీత స్పందిస్తూ… మే 30న పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది.. ఈ పెళ్లి గురించి ముందుగా మీకు సమాచారం అందించలేకపోయాను… అందుకు మీరు అందరూ నన్ను క్షమించాలి అంటూ అభిమానులను క్షమాపణ కోరింది.ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పెళ్లి తేదీన చివరి వరకు మేము కూడా నిర్ణయించలేక పోయామని ఏదో ఒక తేదీని చెబుతూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు… అందుకే పెళ్లి తేదీని ఎవరికీ చెప్పలేదని ప్రణీత తెలిపారు. ప్రస్తుతం ప్రణీత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…