ఆ విషయం తన కుటుంబాన్ని ఎంతో కృంగదీసింది.. నటి నవ్య స్వామి..

May 21, 2021 2:26 PM

నా పేరు మీనాక్షి సీరియల్ భార్య ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నవ్య స్వామి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తుంటారు. తాజాగా ఈమె అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన లవ్ స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చారు.

మైసూర్ కు చెందిన ఈ భామ డాక్టర్ కావాలని ఉండేదట. అయితే ఓసారి కన్నడ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి ఆ విధంగా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ కన్నడ నాట సూపర్ హిట్ అయింది. తెలుగులో”నా పేరు మీనాక్షి” సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం “ఆమె కథ” సీరియల్ లో నటిస్తోంది. బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్న ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం నవ్య స్వామి నటిస్తున్న ఆమె కథ సీరియల్ లో రవికృష్ణ, నవ్య స్వామి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఈ జంట బుల్లితెరపై పాపులర్ అయింది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా జంటగా నటిస్తున్న ఈ ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి.ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వార్తలు రావడంతో తన కుటుంబం ఎంతో డిస్ట్రబ్ అయ్యిందని, ఈ విషయం తన కుటుంబాన్ని ఎంతో బాధించిందని తెలిపారు.రవి తను కేవలం మంచి స్నేహితులని వారి మధ్య ఎటువంటి ప్రేమ లేదని నవ్య స్వామి క్లారిటీ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment