వామ్మో.. తన డైరీ మొత్తం బయటపెట్టిన రష్మిక!

July 3, 2021 3:21 PM

తెలుగు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, అప్పుడప్పుడు అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతుంటారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంటారు.

ఈక్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన రష్మిక తనకు విజయ్ దేవరకొండతో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని బయటపెట్టారు. అలాగే తన పర్సనల్ పిక్ షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన డైరీ రొటీన్ వర్క్ గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఇందులో ఏం రాసి ఉందంటే…

ఓ ఓ నా డైరీ మర్చిపోయాను… ఆరా నన్ను బాగా డిస్టర్బ్ చేయడంతో ఉదయమే నిద్ర లేచాను. ఈ రోజు షూటింగ్ ఏమీ లేకపోవడంతో కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నాను. అనవసరంగా ఉదయాన్నే లేచాను. ఆ తర్వాత ఆరాకు ఇవ్వాల్సిన ఆహారం మందులు ఇచ్చాను ఆ తర్వాత నా టీం వస్తే వారితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నా… అలాగే ఫోన్లోనే 2 ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యాను.. ఆ తర్వాత ఒక మీటింగ్ కోసం రెడీ అయ్యా మీటింగ్ అంతా సవ్యంగా జరిగింది. ఇక ఓ యాడ్ ఫిలిమ్ కు డబ్బింగ్ చెప్పాను.అది పూర్తికాగానే తిరిగి రాత్రి ఎనిమిదింటికి రిటర్న్ వచ్చి ఆరాకు ఫుడ్డు మెడిసన్ ఇచ్చి ఇద్దరం కలిసి పడుకున్నాము. అంటూ తన డైరీలో ఉన్న విషయాలను పూసగుచ్చినట్లు అభిమానులకు చెప్పారు

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now