సుధీర్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించిన ప్రభాస్ డైరెక్టర్..!

August 29, 2021 10:57 AM

సుధీర్ హీరోగా పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీదేవి సోడా సెంటర్” ఆగస్టు 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. గ్రామీణ యువకుడి పాత్రలో సుధీర్ నటన అద్భుతంగా ఉందని పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాను మహేష్ బాబు స్వయంగా హోమ్ థియేటర్ లో చూసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశారు.

ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను విజయ తీరం వైపుకు తీసుకెళ్లారని సినిమాపై మహేష్ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు మరో వ్యక్తి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఈ సినిమాపై స్పందించారు.

https://twitter.com/prashanth_neel/status/1431520745297887237?ref_src=twsrc%5Etfw

ఈ క్రమంలోనే ప్రశాంత్‌ నీల్ మాట్లాడుతూ ముందుగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నిర్మించిన తన మిత్రుడు విజయ్ చిల్లాకు అభినందనలను తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రతి ఒక్కరూ కలిసి ఈ సినిమా విజయవంతం కావడానికి కృషి చేశారని చిత్ర బృందంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment