ప్ర‌భాస్ మ‌రో ఘ‌న‌త‌.. ఆసియాలో టాప్‌ 10 హ్యాండ్‌స‌మ్ పురుషుల్లో నంబ‌ర్ వ‌న్ స్థానం..

July 22, 2021 7:21 PM

బాహుబ‌లి సినిమాతో అంత‌ర్జాతీయ స్టార్ డ‌మ్‌ను సంపాదించుకున్న త‌రువాత సాహో మూవీ చ‌తికిల ప‌డినా ప్ర‌భాస్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఇక ప్ర‌భాస్ తాజాగా ఇంకో ఘ‌న‌త సాధించాడు. ఆసియాలోని టాప్ 10 మోస్ట్ హ్యాండ్‌స‌మ్ మెన్‌ల‌లో ప్ర‌భాస్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు.

prabhas stands at number 1 position in asias top 10 handsome mens list

ప‌లువురు ప్ర‌ముఖుల‌ను కూడా దాటేసి ప్ర‌భాస్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు. ప్ర‌భాస్ త‌రువాత పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ అబ్బాస్ న‌క్వీ రెండో స్థానంలో నిల‌వ‌గా, జ‌పాన్‌కు చెందిన జిన్ అక‌నిషి మూడో స్థానంలో నిలిచాడు. త‌రువాత ద‌క్షిణ కొరియాకు చెందిన కిమ్ హ‌యూన్ జూంగ్ (4), వియ‌త్నాంకు చెందిన నాన్ ఫుచ్ విన్హ్ (5), చైనాకు చెందిన హువాంగ్ షియోమింగ్ (6), ఇండియాకు చెందిన వివియ‌న్ డిసెనా (7), పాకిస్థాన్‌కు చెందిన ఫ‌వాద్ ఖాన్ (8), థాయ్‌లాండ్‌కు చెందిన థ‌నావ‌త్ వ‌త్త‌న‌పుటి (9), తైవాన్‌కు చెందిన వాల్లెస్ హువో (10)లు వ‌రుస స్థానాల్లో నిలిచారు.

ఇక ప్ర‌భాస్ ఈ ఘ‌న‌త సాధించ‌డంపై ఆయ‌న ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్ర‌భాస్ రాధే శ్యామ్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now