మరోసారి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్!

April 16, 2021 11:12 AM

లో “హరహర వీరమల్లు”చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా మలయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనమ్ కోషియం” తెలుగు రీమేక్ తో బిజీగా ఉన్నారు. ఈ రెండూ కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ వంటి భారీ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

హరీష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తరహా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. “పిఎస్పీకే 28” అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం హరీష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదివరకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ 2 చిత్రాలలో పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ 28వ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ విషయం పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now