బంగార్రాజు ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన నాగ చైతన్య..!

August 29, 2021 10:49 PM

అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన వరుస అప్‌డేట్‌ లను విడుదల చేస్తూ ఎంతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అదేవిధంగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా “బంగార్రాజు” సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలుసు.

ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగచైతన్య విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున అచ్చం సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని బంగార్రాజును తలపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ కింద “ది డెవిల్ ఈజ్‌ బ్యాక్ అనే క్యాప్షన్” కూడా ఉంది. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య ఉన్న పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఇందులో నాగార్జున సరసన రమ్య కృష్ణ నటించగా నాగచైతన్య సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్క విజయం కూడా లేని నాగార్జున ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలైనా నాగార్జునకు సక్సెస్ ను అందిస్తాయో లేదో వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now