చిరు 153వ సినిమాలోకి గ్రాండ్ ఎంట్రీ.. వచ్చి రావడంతోనే చితక్కొట్టిన మెగాస్టార్!

August 14, 2021 10:20 PM

మెగాస్టార్ చిరంజీవి కొంతకాలం విరామం తర్వాత రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే వరుస సినిమాల ను లైన్ లో పెట్టి ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ 152 విచిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరిదశ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ చిత్రం అయినటువంటి “లూసిఫర్ “చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రంలో తెలుగులో చిరంజీవి. ఈ క్రమంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఫైట్ సీన్ లో పాల్గొన్నారు.స్టంట్‌ మాస్టర్‌ సిల్వ నేతృత్వంలో జరిపిన ఈ సన్నివేశంలో మెగాస్టార్ విలన్లను చితక్కొట్టారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో రీమేక్ అవుతున్నటువంటి ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now