సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న మంచు హీరో..? కారణం అదే !

August 21, 2021 5:03 PM

సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబుకు ముగ్గురు సంతానం. వారు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో తనదైన శైలిలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా పలు సినిమాలలో సందడి చేశాడు.

మంచు మనోజ్ హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో ఆయనకి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో మంచు మనోజ్ తన సొంత బ్యానర్ లోనే అహంబ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమా గురించి ఏ విషయమూ వెల్లడించలేదు.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ కి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెబుతూ కొత్తగా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆంధ్ర తెలంగాణలో వెంచర్స్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి మంచు మనోజ్ త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now