ఎన్టీఆర్ సినిమాలో మహేష్ హీరోయిన్ ఖాయమేనా?

May 17, 2021 6:07 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కియారా అద్వాని, రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – శివ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించనుందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “భరత్ అనే నేను” సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో కూడా కియారాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ “ఆచార్య”సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే దర్శకుడు ఒకవైపు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు స్క్రిప్టుకు సరైన మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now