టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలామంది అమ్మాయిలు ప్రభాస్ లాంటి భర్త రావాలని కోరుకుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం ఇష్టాన్ని పెంచుకున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒక హీరోయిన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం నేనొక్కడినే. ఇందులో మహేష్ బాబు సరసన కృతి సనన్ ఆడిపాడింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది కృతిసనన్. ఈ సినిమా కూడా ఆమెను తీవ్ర నిరాశ పరచడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెబుతూ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం ప్రభాస్ “ఆదిపురుష్”చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కృతిసనన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్‌లో మీరు పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఎవరిని చేసుకుంటారని అడగగా.. అందుకు ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరితో డేట్ చేస్తారని అడగగా.. టైగర్ ష్రాఫ్ అని సమాధానం చెప్పిన ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…