“భోళాశంకర్” గా.. మెగాస్టార్ 154వ చిత్రం..!

August 22, 2021 1:47 PM

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి నటిస్తున్న సినిమాకు సంబంధించిన సమాచారం వెలువడుతుందని అభిమానులు కొన్ని రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంగా చేస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.

ప్రస్తుతం మెగాస్టార్ 153వ చిత్రంగా కొరటాలశివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ 154 చిత్రంగా “వేదాళం” సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.

తెలుగులో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి “వేదాళం” చిత్రానికి “భోళాశంకర్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now