ఫ్యాన్స్‌కు హోలీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్ బాబు

March 29, 2021 5:11 PM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హోలీ పండుగ సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఇటీవ‌లే స‌ర్కారు వారి పాట మొద‌టి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. కాగా హోలీ పండుగ సంద‌ర్భంగా మ‌హేష్ ట్విట్వ‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపాడు.

mahesh babu holi wishes to fans

అంద‌రికీ హోలీ పండుగ శుభాకాంక్ష‌లు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబ‌ట్టి అంద‌రం బాధ్య‌త‌గా ఉంటూ పండుగ‌ను కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకుందాం. ఈ హోలీ మీకు ప్రియ‌మైన వారి నుంచి మ‌రింత ప్రేమ‌ను అందించాలి.. అని మ‌హేష్ అన్నాడు.

కాగా స‌ర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు క‌లిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఇక ఇటీవ‌లే మ‌హేష్ కు చెందిన మ‌హ‌ర్షి మూవీకి 2 నేష‌న‌ల్ ఫిలిం అవార్డులు ల‌భించాయి. దీంతో మ‌హేష్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే స‌ర్కారు వారి పాట మూవీ త‌దుప‌రి షెడ్యూల్ గురించి ఎప్పుడు వార్త చెబుతారా ? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment