జబర్దస్త్ వర్షకు కరోనా పాజిటివ్…!

April 20, 2021 10:31 PM

ప్రస్తుతం కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలు కనిపిస్తే జనాలు స్వచ్ఛందంగా క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ వారికి ఎక్కువగా వ్యాపించింది.తాజాగా వకీల్ సాబ్ చిత్రబృందం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడ్డారు ఇప్పుడు ఈ మహమ్మారి వెండితెర నుంచి బుల్లితెరవైపు వ్యాపించింది.

జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడినట్లుగా స్వయంగా వర్ష లైవ్ ద్వారా తెలియజేశారు. వర్ష లైవ్ లో మాట్లాడుతూ.. రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. దీంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో లైవ్ లోకి వచ్చి కొన్ని సూచనలను తెలియజేశారు.

ప్రస్తుతం వర్ష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోయాయి. ఇక్కడ జరుగుతుండేది ఎవరికీ తెలియదు వీటిని చూస్తే భయపడతారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారిని ఇలా ప్యాక్ చేసి అలా పడేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలని ఈ జబర్దస్త్ భామ తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment