మళ్లీ ఫామ్ లోకి వచ్చిన త్రిష.. ఈసారి ఆ స్టార్ హీరోతో జోడి ?

July 28, 2021 7:43 PM

సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు వెళుతుంటారు. కానీ ఒకసారి హీరోయిన్ గా ఎంటర్ అయిన వారు కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తర్వాత వారికి అవకాశాలు రావడం తగ్గిపోతుంటాయి. ఇలా ఒకప్పుడు తెలుగు తమిళ కన్నడ భాషలలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించిన త్రిషకి ఆ తర్వాత అవకాశాలు రావడం తగ్గిపోయాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే త్రిష పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే ఉంటున్న ఈ బామకు ఇప్పుడిప్పుడే అవకాశాలు రావడంతో మళ్లీ ఫామ్ లోకి వస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు లేనప్పటికీ తమిళంలో మాత్రం సుమారు అరడజనుకు పైగా సినిమాలను చేజిక్కించుకుని ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష ఓ స్టార్ హీరో సరసన నటించే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు అని చెప్పవచ్చు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలు హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారని సమాచారం వినబడుతుంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన “పవర్” అనే సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా బాగా సంపాదించడంతో ప్రస్తుతం పవన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ “ద్విత్వ”అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అతనికి జోడీగా త్రిష సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకోనున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment