బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సందడి చేసిన ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి ఈ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఇటీవలే ముక్కు అవినాష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ముక్కు అవినాష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు, మా కుటుంబాలు కలుసుకున్నాయి, ఆ తర్వాత మేం కలుసుకున్నాం, త్వరలోనే అనుజాతో పెళ్లి.. అంటూ అవినాష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ముక్కు అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు తెలియగానే నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ అమ్మాయి ఎవరు, ఏంటి.. అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూజా అని తేలింది.. ఆమె కూడా అవినాష్ సామాజికవర్గానికి చెందిన అమ్మాయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. అయితే వీరు పెళ్లి ఎప్పుడు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అవినాష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…