ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే ?

September 1, 2021 10:34 PM

బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సందడి చేసిన ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి ఈ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే ?

ఇటీవలే ముక్కు అవినాష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ముక్కు అవినాష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేస్తూ సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు, మా కుటుంబాలు కలుసుకున్నాయి, ఆ తర్వాత మేం కలుసుకున్నాం, త్వరలోనే అనుజాతో పెళ్లి.. అంటూ అవినాష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ముక్కు అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు తెలియగానే నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ అమ్మాయి ఎవరు, ఏంటి.. అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూజా అని తేలింది.. ఆమె కూడా అవినాష్ సామాజికవర్గానికి చెందిన అమ్మాయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. అయితే వీరు పెళ్లి ఎప్పుడు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అవినాష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now