చరణ్ సినిమాలో భాగమవుతున్న అంజలి.. ఏ సినిమా అంటే ?

August 13, 2021 5:39 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ “RRR”సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలంటే ఏ స్థాయిలో ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు గతంలో తెలియజేశారు. ఇప్పటికే రామ్ చరణ్ సరసన నటించడం కోసం కియారా అద్వానిను ఎంపిక చేసుకోగా.. మరొక హీరోయిన్ కోసం దర్శకుడు వేట మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో మరొక హీరోయిన్ పాత్రలో చేయడం కోసం అంజలిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అంజలి తాజాగా వకీల్ సాబ్ సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకుంది.ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో చరణ్ సరసన ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడం కోసం ఈమెకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment