బుల్లితెరపై కథ కొన్ని సంవత్సరాల నుంచి టాప్ రేటింగ్ దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు గొప్ప స్థాయిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో జడ్జిగా నాగబాబు వ్యవహరించేవారు.కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి నాగబాబు టీమ్ లీడర్ చమ్మక్ చంద్ర తప్పుకున్నారు. ఇక నాగబాబు స్థానంలోకి సింగర్ మను వచ్చారు. జబర్దస్త్ కార్యక్రమం నుంచి నాగబాబు వెళ్లిపోయినప్పటికీ షో రేటింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా నాగబాబు వెళ్లిన తర్వాత ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కూడా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. మరి జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
మంచిగా జడ్జి రోజా విషయానికి వస్తే రోజా ఒక కార్యక్రమానికి సుమారుగా రూ.3 నుంచి రూ.4 లక్షలు తీసుకునేది. నాగబాబు వెళ్లిపోవడంతో ఈమె కూడా వెళ్లకుండా ఉండటం కోసం నిర్వాహకులు అమాంతం ఆమె రెమ్యునరేషన్ రెండింతలు చేశారు. ఈ లెక్కన రోజా నెలకు సుమారు రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా సింగర్ మను ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ అనసూయ మొదట్లో రూ.80 వేల వరకు డిమాండ్ చేసేది. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ రూ.లక్షకు పై మాటే. అదేవిధంగా యాంకర్ రష్మి నెలకు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక టీం లీడర్స్ విషయానికి వస్తే మొదట్లో రూ.3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం రూ.నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా హైపర్ ఆది రూ.3 లక్షలు, అదిరే అభి రూ.రెండు లక్షలు, రాకెట్ రాఘవ రూ.2.75 లక్షలు, బుల్లెట్ భాస్కర్ రూ.2 లక్షలు, చలాకి చంటి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కరోనా ప్రభావం వల్ల వీరి రెమ్యూనరేషన్ ఇప్పుడే పెంచే యోచనలో నిర్వాహకులు లేరని తెలుస్తోంది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి మరింత రేటింగ్ పెరిగితే వీరి రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…