సినిమా సెట్ లో భయంకరంగా కొట్టుకున్న బిగ్ బాస్ సోహైల్, క్రూ.. వీడియో వైరల్

April 2, 2021 10:58 PM

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహైల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ విజేత కానప్పటికీ ఎన్నో అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సోహైల్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా సినిమా సెట్ లో సోహైల్ చిత్ర యూనిట్ సభ్యుడు క్రూ తో భయంకరంగా గొడవకు దిగారు.

ఉన్నఫలంగా ఇద్దరు సినిమా సెట్లో పిచ్చిపిచ్చిగా కొట్టుకుపోవడంతో అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వీరిద్దరు గొడవ పడటంతో అక్కడున్న వారు ఎంత సర్ది చెప్పినా వినక పోవడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా సోహైల్ క్రూ పై విరుచుకుపడడంతో నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

ఈ క్రమంలోనే నిర్మాత వారిరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక వీరి గొడవ చూసి హీరోయిన్ ఏకంగా కంటతడి పెట్టేసింది. వీరిద్దరి గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వీరి అసలు ఎందుకు గొడవ పడ్డారు, ఎందుకు ఈ విధంగా కొట్టుకుంటున్నారు అనే విషయం గురించి క్లారిటీ లేదు. నిజంగానే కొట్టుకున్నారో లేక ఫ్రాంకో అర్థం కావడం లేదు.మొత్తానికి వీరి గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment