బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ మరే ఇతర షోలకు లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వివిధ భాషలలో పలు సీజన్లలో ప్రసారమవుతుంది.తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభించబోతుంది. అదేవిధంగా హిందీలో బిగ్ బాస్ ఏకంగా 15 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించనున్నారు. తాజాగా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హిందీలో బిగ్ బాస్ సీజన్ 15 త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఎప్పటిలా ఈ కార్యక్రమం టీవీలో కాకుండా ఈసారి నేరుగా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పేరులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం కావడంతో దీనికి బిగ్ బాస్ ఓటీటీ అని పేరు మార్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఆరు వారాలు మనకు టీవీలో కంటే ముందుగా ఓటీటీలో ప్రసారం కానుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ సీజన్ 15 వూట్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. ఈ యాప్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లైఫ్ ఫీడ్‌ని 24X7 చూసే అవకాశం ఉంది. టీవీలో కంటే ముందుగానే ఈ కార్యక్రమాన్నిఓటీటీలో బిగ్ బాస్ అంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో ఇది ఒక చాలెంజ్ అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ సీజన్ 15 ఆగస్టు నెలలో ఓటీటీలో ప్రసారం కాగా.. ఆ తర్వాత ఎప్పటిలాగే కలర్స్ ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే మన తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోను ఈ విధంగా ఓటీటీలో ప్రసారం చేయడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. హిందీతో పోల్చుకుంటే తెలుగులో ఓటీటీ వినియోగించేవారి శాతం తక్కువగా ఉండటంతో తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టీవీలోనే ప్రసారమవుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…