నా జీవితంలో అటువైపు వెళ్ళను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

May 3, 2021 1:20 PM

బండ్ల గణేష్ ఒకప్పుడు కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఇతను తరువాత నిర్మాతగా మంచి స్థానానికి ఎదిగారు. అయితే సినిమా రంగంలో ఎంతో దూకుడు ప్రదర్శిస్తున్న బండ్ల గణేష్ 2018 లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన బండ్లగణేష్ అప్పుడు ఓ స్థాయిలో రెచ్చిపోయి విమర్శల పాలయ్యారు. చివరికి బండ్ల గణేష్ అంటే పొలిటికల్ కారిడార్ లో ఒక జోకర్ గా మిగిలిపోయారు.

సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్లగణేష్ రాజకీయాలలోకి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కోవడంతో తనకు రాజకీయాలు రాలేదని త్వరగానే అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన పొలిటికల్ ఎంట్రీ పైఎప్పుడు ఏవో ఒక వార్తలు వస్తున్నప్పటికీ బండ్లగణేష్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సమాధానం చెప్పేవారు.

తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడిన అనంతరం బండ్ల గణేష్ మమతా బెనర్జీ పార్టీ అత్యధిక మెజార్టీతో దూసుకుపోవడంతో బండ్ల గణేష్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే నెటిజన్ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఏంటి అన్నా ఈ పార్టీలో చేరుతారా? అని కామెంట్ చేయగా అందుకు బండ్లగణేష్ ఇకపై నా జీవితంలో రాజకీయాల వైపు వెళ్ళను.. నా జీవితంలో వాటికి చోటు లేదంటూ స్పందించడం వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now