యాంకర్ ప్రదీప్ ను ముత్తాత అంటూ.. అవమానపరిచిన ఆ కంటెస్టెంట్!

August 6, 2021 6:49 PM

బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న యాంకర్లలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఎన్నో సినిమాలలో చేస్తూ హీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగు లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన సొమ్మును నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ప్రోమోలో భాగంగా విజ్వల్ నందమూరి బాలకృష్ణ గెటప్ లో అదరగొట్టారు. బాలకృష్ణ వేషధారణలో వచ్చిన విజ్వల్ అచ్చం బాలయ్యబాబు హావభావాలను వ్యక్తపరుస్తూ అందరినీ నవ్వించారు.

ఈ స్కిట్ లో భాగంగా విజ్వల్ ఈరోజు ఉదయం లేవగానే భూదేవికి నమస్కారం అంటూ భూమికి నమస్కారం చేశాడు. అదేవిధంగా సునీతను చూపిస్తూ గోమాతకు నమస్కారం అని నమస్కారం చేయగా… యాంకర్ ప్రదీప్ ని చూపిస్తూ ముత్తాతకు నమస్కారం అనగానే అందరూ ఉన్నఫలంగా నవ్వారు. అదేవిధంగా ఒక బాధితురాలు తన కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది తనకు సహాయం కావాలని కోరగానే వెంటనే తనకు సహాయం చేసినట్లు ఈ ప్రోమోలో చూపించారు. అయిన వాళ్లకు కష్టమొస్తే అరగంట అయినా ఆలస్యంగా వస్తానేమో కానీ.. ఆడపిల్లకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను అనే డైలాగ్ ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ స్కిట్ తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న వారు బాలయ్య బాబు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now