బాలకృష్ణ అఖండ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. పక్కా ప్లాన్ చేసిన బోయపాటి..!

September 2, 2021 1:50 PM

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “అఖండ”. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 3వ సినిమాగా చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్, సింహ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలలో బాలకృష్ణను ఎంతో పవర్ ఫుల్ లుక్ లో చూపించిన బోయపాటి అంతకు మించి అఖండ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ అఖండ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. పక్కా ప్లాన్ చేసిన బోయపాటి..!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఏకంగా 8 ఫైట్ సీన్స్ ఉన్నాయని, అయితే ఇవన్నీ ఒక దానికొకటి సంబంధం లేకుండా ఎంతో భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది.

నందమూరి అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని దృష్టిలో ఉంచుకుని బాలయ్యను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. సందర్భానుసారంగా వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలువనున్నాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now