బన్నీతో క్లాస్ రూమ్ లో అలా ఒంటరిగా కూర్చొని అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన బ్యూటీ?

June 16, 2021 5:24 PM

ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఎంతోమంది వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతూ సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు గా మారి మంచి గుర్తింపును  సంపాదించుకున్నారు. తాజాగా వచ్చిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నటించిన అనన్య మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అనన్య ఇంటర్వ్యూ ఛానల్ ద్వారా మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.ఒకసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనతో కలిసి ఏకాంతంగా క్లాస్ రూంలో కూర్చుని సిటింగ్ వేసినట్లు తెలియజేశారు.అయితే ఇదంతా నిజజీవితంలో కాదని ఇదంతా తన కలలో జరిగిన విషయమని తెలిపారు.

ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న అనన్య తన దృష్టిని మొత్తం తన గ్రాడ్యుయేషన్ పైనే పెట్టినట్లు చదువు పూర్తి కాగానే తన నటనను కొనసాగించాలా లేదా అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.అదే విధంగా అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని ఎప్పటికైనా తనని కలవాలి అనేది తన కోరిక అని తన మనసులో ఉన్న కోరికను ఈ సందర్భంగా బయటపెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now