డిగ్రీ చ‌దివి ఊరుకోలేదు.. ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ స‌క్సెస్ సాధించిన అమ్మాయిలు..

August 23, 2021 5:36 PM

గ్రాడ్యుయేష‌న్ పూర్త‌య్యాక చాలా మంది జాబ్‌ల‌ను వెదుక్కునే ప‌నిలో ప‌డ‌తారు. ఉద్యోగం దొరికితే స‌రే.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వ‌స్తుంది. ఇక క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఉద్యోగాలు దొర‌క‌డం ఇంకా క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అయితే ఉద్యోగాలు దొరక్క‌పోయినా స‌రే త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌గ‌ల‌మ‌ని ఆ యువ‌తులు నిరూపించారు. స్వ‌యం ఉపాధి ద్వారా చ‌క్క‌ని ఆదాయం సంపాదిస్తున్నారు.

డిగ్రీ చ‌దివి ఊరుకోలేదు.. ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ స‌క్సెస్ సాధించిన అమ్మాయిలు..

హైద‌రాబాద్‌కు చెందిన డి.రిషి వ‌ర్మ‌, నిజామాబాద్‌కు చెందిన కె.శ్రీ‌దుర్గ‌లు గ‌తేడాది గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. హైద‌రాబాద్‌లోని బేగంపేట‌లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫ‌ర్ వుమెన్ లో బ్యాచిల‌ర్ ఆఫ్ వొకేష‌న‌ల్ స్ట‌డీస్ (రిటెయిల్ మేనేజ్‌మెంట్ అండ్ ఐటీ) విద్య‌ను అభ్య‌సించారు. అయితే గ్రాడ్యుయేష‌న్ చేశారు కానీ కోవిడ్ వ‌ల్ల ఉద్యోగాలు దొర‌డం లేదు క‌దా, అందువ‌ల్ల ఖాళీగా ఉండ‌డం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం మొద‌లు పెట్టారు. ఫోక్‌టేల్స్ 22 పేరిట సంస్థ‌ను నెల‌కొల్పారు. దాని స‌హాయంతో ఊర‌గాయ పేరిట అనేక ర‌కాల ప‌చ్చ‌ళ్లు, పొడుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 16న బేగంపేట‌లో వారు ఊర‌గాయ‌ను నెల‌కొల్ప‌గా దాంతో ప‌చ్చ‌ళ్లు, పొడుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు. అత్యంత నాణ్యంగా, శుభ్ర‌మైన ప్యాకింగ్‌తో అత్యంత రుచిక‌రంగా ఉండేలా వాటిని అందిస్తున్నారు. దీంతో వారి ప‌చ్చ‌ళ్లు, పొడుల‌కు రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్లు ఏర్ప‌డ్డారు. ఈ విధంగా వారు ఇందులో స‌క్సెస్ సాధించారు.

డిగ్రీ చ‌దివి ఊరుకోలేదు.. ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ స‌క్సెస్ సాధించిన అమ్మాయిలు..

ప్ర‌స్తుతం వారు www.theuragaya.com అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందులో ప‌చ్చ‌ళ్ల‌ను, పొడుల‌ను విక్ర‌యిస్తున్నారు. ట‌మాటా, మామిడి, నిమ్మ‌, గోంగూర‌, అల్లం, ఉసిరికాయ‌, ఎండు మిర‌ప కాయ వంటి ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసి అమ్ముతున్నారు. వీరు వాటిని హోం డెలివ‌రీ కూడా చేస్తున్నారు. బల్క్ ఆర్డ‌ర్లు తీసుకుని కూడా వాటిని త‌యారు చేస్తున్నారు. ప‌చ్చ‌ళ్ల‌ను కేజీకి రూ.400 నుంచి విక్ర‌యిస్తుండ‌గా, పొడుల‌ను రూ.90 నుంచి విక్ర‌యిస్తున్నారు. రానున్న రోజుల్లో త‌మ సంస్థ‌ను మ‌రింత విస్త‌రిస్తామ‌ని వీరు చెబుతున్నారు. గ్రాడ్యుయేష‌న్ పూర్త‌యి కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు ప‌డుతున్న‌ వారికి వీరు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment