ఎర్ర బెండకాయ‌ల సాగుతో లాభాలు గ‌డిస్తున్న రైతు..!

September 6, 2021 5:22 PM

సాధార‌ణంగా బెండ కాయ‌లు గ్రీన్ క‌ల‌ర్ లో ఉంటాయి. కానీ మ‌న‌కు మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఎరుపు రంగులో ఉండే బెండ‌కాయ‌లు కూడా ల‌భిస్తున్నాయి. వీటిని చాలా మంది రైతులు ప్ర‌స్తుతం సాగు చేస్తున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందుక‌నే వీటిని తినేందుకు జ‌నాలు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల అభిరుచులకు అనుగుణంగా రైతులు కూడా వీటిని పండించ‌డానికే మొగ్గు చూపిస్తున్నారు.

ఎర్ర బెండకాయ‌ల సాగుతో లాభాలు గ‌డిస్తున్న రైతు..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా ఖాజూరి క‌ల‌న్ అనే ప్రాంతానికి చెందిన మిస్రిలాల్ రాజ్‌పూత్ ఎరుపు రంగు బెండ‌కాయ‌ల‌ను సాగు చేస్తున్నాడు. వార‌ణాసిలో ఉన్న అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ నుంచి ఎరుపు రంగు బెండ విత్త‌నాల‌ను 1 కిలో తెచ్చాన‌ని వాటిని జూలై మొద‌టి వారంలో నాట‌గా 40 రోజుల్లో పెర‌గ‌డం ప్రారంభించాయ‌ని తెలిపాడు.

ఎరుపు రంగు బెండ‌కాయ‌ల‌ను పండించేందుకు ఎలాంటి కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాల‌ను వాడ‌లేద‌ని, పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో సాగు చేశాన‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలో పంట బాగా వ‌చ్చింద‌ని అన్నాడు. ఒక ఎక‌రాల స్థ‌లంలో క‌నీసం 40-50 క్వింటాళ్ల నుంచి గ‌రిష్టంగా 70-80 క్వింటాళ్ల వ‌ర‌కు ఎరుపు రంగు బెండ‌కాయ‌ల‌ను పండించ‌వ‌చ్చ‌ని తెలిపాడు.

ఎర్ర బెండకాయ‌ల సాగుతో లాభాలు గ‌డిస్తున్న రైతు..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఎరుపు రంగు బెండ‌కాయ‌ల‌ను మంచి డిమాండ్ ఉంది. ఈ క్ర‌మంలోనే సాధార‌ణ బెండ కాయ‌ల‌క‌న్నా ఎరుపు రంగు బెండ‌కాయ‌ల రేటు 5-7 రెట్లు ఎక్కువ‌గా ఉంది. ఎరుపు రంగు బెండ‌కాయ‌లు కిలోకు రూ.700 నుంచి రూ.1200 వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతున్న‌ట్లు ఆ రైతు తెలిపాడు. వీటి వ‌ల్ల లాభాలు బాగా వ‌స్తున్న‌ట్లు వివ‌రించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now