Multani Mitti : ముల్తానీ మ‌ట్టితో బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

September 7, 2023 10:27 AM

Multani Mitti : ఎక్కువ మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఉద్యోగాలని కూడా కాదనుకుని వ్యాపారాల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఏదైనా మంచి బిజినెస్ కోసం చూసేవారు, ముల్తానీ మట్టి బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ లో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ లాభాలను పొందవచ్చు.

మార్కెట్లో ముల్తానీ మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ముల్తానీ మట్టిని మీరు సులభంగా ఎక్కువగా కొనుగోలు చేసి, కేజీని రూ.20 నుండి రూ.25 రూపాయల దాకా అమ్ముకో వచ్చు. కావాలంటే మీరు ముల్తానీ మట్టిని కొనేసి, దానితో మీరు మంచి ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేసి సేల్ చేయవచ్చు. ఇవి కూడా మంచి లాభాలని ఇస్తాయి.

Multani Mitti do business and earn good income
Multani Mitti

ఇక ఈ బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది చూస్తే.. ముల్తానీ మట్టి బిజినెస్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. దీని కోసం మీరు కేవలం రూ.20,000 నుండి రూ.30,000 లను పెట్టుబడి కింద పెడితే సరిపోతుంది. ముల్తానీ మట్టి బిజినెస్ కోసం మీరు పలు మిషన్స్ ని కొనుగోలు చేయాలి.

అలాగే ఈ బిజినెస్ కోసం నీళ్లు, ముల్తానీ మట్టి, ప్యాకింగ్ మిషన్ వంటివి అవసరమవుతాయి. ముల్తానీ మట్టిని మీరు చిన్న చిన్న ప్యాకెట్ల లాగా చేసి రూ.12 కి లేదంటే రూ.20 కి అమ్మితే మంచిగా లాభం వస్తుంది. ఇలా వేలల్లో ప్రతి నెలా లాభాలని పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఐడియా. మరి ఇక ఇలా అనుసరించి ఈ బిజినెస్ తో అదిరే లాభాలని పొందండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment