సాంప్రదాయ పంటలకు కాలం చెల్లింది. చేతిలో టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం రైతులు రక రకాల పంటలను పండిస్తున్నారు. రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో నిమ్మగడ్డి ఉపయోగం కూడా బాగా పెరిగింది. దీంతో కొందరు రైతులు దీన్ని పండిస్తూ భారీ ఎత్తున లాభాలను గడిస్తున్నారు.

నిమ్మగడ్డిని పెంచడం చాలా సులభమే. దీనికి ప్రత్యేకంగా ఎరువులు ఉపయోగించాల్సిన పనిలేదు. కీటకాల బెడద కూడా ఉండదు. ఈ పంటకు అయ్యే ఖర్చు కూడా తక్కువే. లెమన్ గ్రాస్ పంటను ఫిబ్రవరి నుంచి జూలై మధ్య పండిస్తే చక్కని లాభాలను పొందవచ్చు. ఒక్కసారి పంట్లను వేస్తే కేవలం 3 నుంచి 5 నెలల్లోనే పంట చేతికి వస్తుంది.
నిమ్మగడ్డితో నూనెను తయారు చేస్తారు. దీనికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంది. అందుకనే చాలా మంది లెమన్ గ్రాస్ ను పండిస్తున్నారు. లెమన్ గ్రాస్ ఆయిల్‌ను ఔషధాల తయారీలో, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అందుకని లెమన్ గ్రాస్‌ను పెంచితే తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి సాధించి అధిక మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు.
లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక లీటర్ నూనె ఏకంగా రూ.1500 వరకు ధర పలుకుతుంది. అందువల్ల ఒక ఎకరం స్థలం ఉంటే లెమన్ గ్రాస్‌ను పెంచుతూ ఏకంగా రూ.1 లక్ష వరకు సంపాదించవచ్చు. కొత్త పంటలు వేయాలనుకునే వారు, పెద్దగా శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితోనే లెమన్ గ్రాస్‌ను పండించవచ్చు. దీంతో లాభాలను ఆర్జించవచ్చు.









The advice you have given is very good, let me know the details of it in full.