మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఎల‌క్ట్రిక్ బైక్స్ ఇవే.. ఫీచ‌ర్ల‌పై ఒక్క లుక్కేయండి..!

August 26, 2021 10:00 PM

రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌రల నేప‌థ్యంలో చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసి వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వాటి ధ‌ర ఎక్కువే అయిన‌ప్ప‌టికీ నిర్వ‌హ‌ణ వ్య‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంధ‌న ధ‌ర‌ల నుంచి విముక్తి క‌ల‌గ‌డం వంటి సానుకూల అంశాల కార‌ణంగా చాలా మంది విద్యుత్ వాహ‌నాల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఎల‌క్ట్రిక్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఎల‌క్ట్రిక్ బైక్స్ ఇవే.. ఫీచ‌ర్ల‌పై ఒక్క లుక్కేయండి..!

1. ఓలా ఎస్1

ఈ బైక్ ధ‌ర రూ.1,09,999గా ఉంది. ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 236 కిలోమీట‌ర్ల దూరం వెళ్ల‌వ‌చ్చు. 4.8 కిలోవాట్అవ‌ర్‌ బ్యాట‌రీ ల‌భిస్తుంది. 3 గంట‌ల పాటు చార్జింగ్ పెడితే 80 శాతం చార్జింగ్ అవుతుంది. గంట‌కు గ‌రిష్టంగా 105 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు.

2. ర‌గ్గ్‌డ్ జి1

ఈ బైక్ ధ‌ర రూ.79,999. ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 160 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. 2 కిలోవాట్అవ‌ర్‌ బ్యాట‌రీ ఉంది. మూడున్నర గంట‌ల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంట‌కు గ‌రిష్టంగా 70 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఎల‌క్ట్రిక్ బైక్స్ ఇవే.. ఫీచ‌ర్ల‌పై ఒక్క లుక్కేయండి..!

3. ఏథ‌ర్ 450ఎక్స్

దీని ధ‌ర రూ.1.13 ల‌క్ష‌లు. ఫుల్ చార్జింగ్ చేస్తే 116 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌వచ్చు. 2.9 కిలోవాట్అవ‌ర్‌ బ్యాట‌రీ ల‌భిస్తుంది. సుమారుగా 6 గంట‌ల పాటు చార్జింగ్ చేయాలి. గంట‌కు గ‌రిష్టంగా 80 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు.

4. రివోల్ట్ ఆర్‌వీ400

ఈ బైక్ ధ‌ర రూ.90,799గా ఉంది. ఫుల్ చార్జింగ్‌తో 90 కిలోమీట‌ర్ల దూరం వెళ్ల‌వ‌చ్చు. 3.24 కిలోవాట్అవ‌ర్‌ బ్యాట‌రీ ల‌భిస్తుంది. నాలుగున్నర గంట‌ల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంట‌కు గ‌రిష్టంగా 85 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఎల‌క్ట్రిక్ బైక్స్ ఇవే.. ఫీచ‌ర్ల‌పై ఒక్క లుక్కేయండి..!

5. ఓలా ఎస్‌1 ప్రొ

ఈ బైక్ ధ‌ర రూ.1,29,999. ఫుల్ చార్జింగ్‌తో 181 కిలోమీట‌ర్ల దూరం వెళ్ల‌వ‌చ్చు. 3.97 కిలోవాట్అవ‌ర్‌ బ్యాట‌రీ ల‌భిస్తుంది. ఆరున్న‌ర గంట‌ల పాటు చార్జింగ్ చేయాలి. గంట‌కు గ‌రిష్టంగా 115 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment