RGV : సమంత చైతన్య విడాకులపై వర్మ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

October 3, 2021 9:15 AM

RGV : ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా  వీరి గురించి వస్తున్న వార్తలు నిజమంటూ నాగచైతన్య అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య విడాకులను డిక్లేర్ చేయడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సమంత విడాకుల విషయంపై కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తన దైన శైలిలో ట్వీట్ చేశారు.

RGV : సమంత చైతన్య విడాకులపై వర్మ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

రామ్ గోపాల్ వర్మ.. సమంత నాగ చైతన్యల విడాకుల విషయంపై స్పందిస్తూ.. పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి. పెళ్లంటే చావు.. విడాకులు అంటే పునర్జన్మ.. అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పెళ్లి గురించి గతంలో ఆర్‌జీవీ మాట్లాడిన ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇకపోతే సమంత చైతన్య విడాకులు తీసుకోవడంతో పలువురు అభిమానులు కూడా చాలా బాధగా ఉందంటూ కామెంట్ చేయగా మరికొందరు ఇన్ని రోజులకు నీ దరిద్రం వదిలిపోయింది.. ఇప్పటికైనా నీకు మంచి రోజులు వచ్చాయి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now