Samantha : పుకార్లే నిజ‌మ‌య్యాయి.. మొద‌ట్నుంచీ స‌మంత‌ది అనుమానాస్ప‌ద వ్య‌వ‌హార‌మే..!

October 2, 2021 5:01 PM

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అయితే అటు స‌మంత గానీ, ఇటు నాగ చైత‌న్య కానీ దీనిపై స్పందించ‌లేదు. ఎప్పుడు అడిగినా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దాట‌వేశారు. కానీ చివ‌ర‌కు పుకార్ల‌నే నిజం చేశారు. ఎప్పుడైనా స‌రే సెల‌బ్రిటీలు ప్ర‌వ‌ర్తించే తీరును బ‌ట్టి అభిమానుల‌కు ఆటోమేటిగ్గా వారి వ్య‌వ‌హార‌శైలి తెలిసిపోతుంది. అది దాచేస్తే దాగ‌దు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది.

Samantha : పుకార్లే నిజ‌మ‌య్యాయి.. మొద‌ట్నుంచీ స‌మంత‌ది అనుమానాస్ప‌ద వ్య‌వ‌హార‌మే..!

మొద‌ట్నుంచీ స‌మంత శైలి అనుమానాస్ప‌దంగానే ఉంది. త‌న పేరులో అక్కినేని తీసేసి ఒక్క ఎస్ అనే అక్ష‌రాన్ని మాత్ర‌మే ఉంచ‌డంతో అప్ప‌ట్లో పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇక క్ర‌మ క్ర‌మంగా అవే అనుమానాలు బ‌ల‌పడ్డాయి. ఎక్క‌డికి వెళ్లినా, ఏం చేసినా ఇద్ద‌రూ ఒక్క చోట క‌నిపించే వారు.. కానీ గ‌త కొద్ది రోజులుగా ఎవ‌రి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే సెల‌బ్రిటీలు క‌నుక వారు ఈ విష‌యాన్ని దాచ‌లేరు. వీరే కాదు, ఎవ‌రైనా స‌రే ఒక్క‌సారి ఇలాంటి విష‌యాలు వైర‌ల్ అయ్యాయంటే ఆప‌త‌రం వాళ్ల వ‌ల్ల కాదు.

ఇక స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలోనూ పుకార్లు నిజం అయ్యాయి. అన్నీ దాచి పెట్టాల‌నుకున్నారు. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ప‌సిగ‌డుతూనే ఉంది. చివ‌ర‌కు మీడియా ఊహించిందే నిజ‌మైంది. అయితే ఇక‌పై ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment