Samantha Naga Chaithanya : బ్రేకింగ్ న్యూస్: మేము విడిపోతున్నాం.. అధికారిక ప్రకటన చేసిన నాగ చైతన్య..!

October 2, 2021 4:35 PM

Samantha Naga Chaithanya : అక్కినేని అభిమానులకు ఇది ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. ఇన్ని రోజుల నుంచి వీరి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదంటూ సంతోషపడిన అభిమానులకు నాగచైతన్య ఓ చేదు వార్తను తెలియజేశారు. సమంత, చైతన్య వారి పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమంటూ తాజాగా నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్టుతో తెలిసిపోయింది.

Samantha Naga Chaithanya : బ్రేకింగ్ న్యూస్: మేము విడిపోతున్నాం.. అధికారిక ప్రకటన చేసిన నాగ చైతన్య..!

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నాగచైతన్య తన విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇన్ని రోజులు భార్యాభర్తలుగా కొనసాగుతున్న తామిద్దరం విడిపోతున్నామని, ప్రస్తుతం ఎవరి దారి వారం చూసుకోబోతున్నామని.. గత పది సంవత్సరాల నుంచి మంచి స్నేహ బంధంతో ఉండి పెళ్లి బంధంతో ఒక్కటైన తాము ఇకపై ఎవరిదారి వారు చూసుకోబోతున్నామని తెలియజేశారు.

https://www.instagram.com/p/CUharJFJsoU/?utm_source=ig_web_copy_link

ఎంతో ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజేశారు. ఈ విధమైన క్లిష్ట పరిస్థితులలో ప్రేక్షకులు, అభిమానులు మీడియా తమకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇది కరెక్ట్ డెసిషన్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ నాగచైతన్య, సమంత విడిపోవడం వారి అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయమని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment