Vaishnav Tej : కొండపొలం సినిమా చేస్తానంటే పవన్ మామ అలా అన్నాడు: వైష్ణవ్ తేజ్

October 2, 2021 11:09 PM

Vaishnav Tej : క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన రెండవ సినిమాగా తెరకెక్కిన చిత్రం “కొండపొలం”. ఇందులో వైష్ణవ్ ఒక గ్రామీణ యువకుడి పాత్రలో గొర్రెల కాపరిగా కనిపించనున్నాడు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవ్ రెండవ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించాలని క్రిష్ భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 8వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

Vaishnav Tej : కొండపొలం సినిమా చేస్తానంటే పవన్ మామ అలా అన్నాడు: వైష్ణవ్ తేజ్

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్, వైష్ణవ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైష్ణవ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ఇంత అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ క్రిష్ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

ఈ సినిమా గురించి వైష్ణవ్ మాట్లాడుతూ ఈ సినిమా కథ విన్న సమయంలో ఎంతో ఎక్సైట్ మెంట్ గా అనిపించింది. అయితే ఈ సినిమా కథపై ఒకసారి తన మామయ్య పవన్ కళ్యాణ్ జడ్జ్ మెంట్ కూడా తీసుకుంటానని చెప్పినప్పుడు కథవిన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాలని తనని ప్రోత్సహించినట్లు.. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ తెలియజేశారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ద్వారా వైష్ణవ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now