Horoscope : అక్టోబ‌ర్ 2, 2021. శ‌నివారం.. రాశి ఫ‌లాలు..

October 1, 2021 10:29 PM

Horoscope : అక్టోబరు 2 శనివారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. బుధుడు కన్యా రాశిలోకి తిరోగమనం చెందుతాడు. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల స్థితిలో చోటు చేసుకునే మార్పుల కార‌ణంగా ఆయా రాశుల‌కు చెందిన వారి ఫ‌లితాలు ఈ రోజు ఇలా ఉన్నాయి.

Horoscope : అక్టోబ‌ర్ 2, 2021. శ‌నివారం.. రాశి ఫ‌లాలు..

1. మేషం – ఈ రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారం కోసం చేసే ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. చేసే ప‌నిలో విజ‌యం సాధిస్తారు. వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని చూస్తారు. నూత‌న వ్య‌క్తుల‌ను క‌లిస్తే లాభం క‌లుగుతుంది.

2. వృష‌భం – ఉద్యోగులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. న‌లుగురిలోనూ గౌరవం పొందుతారు. దంప‌తులు జాగ్ర‌త్త‌గా ఉండాలి. విద్యార్థులకు మేలు జ‌రుగుతుంది. కొత్త వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

3. మిథునం – రాజ‌కీయ నాయకులు అయితే కొన్ని ప‌నుల‌లో అవాంత‌రాలు వ‌స్తాయి. చేప‌ట్టే ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. సంతోషంగా గ‌డుపుతారు. బంధువుల‌తో ఆర్థిక లావాదేవీలు చేయ‌రాదు. ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయి.

4. క‌ర్కాటకం – ఈ రోజు వీరికి అదృష్టం బాగుంటుంది. వ్యాపారంలోనూ, జీవిత భాగ‌స్వామి విష‌యంలోనూ సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. డ‌బ్బు పెట్టుబ‌డి పెట్ట‌రాదు.

5. సింహం – స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారుల‌కు ఈ రోజు క‌ల‌సి వ‌స్తుంది. కుటుంబ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

6. క‌న్య – వీరికి కొన్ని అసౌక‌ర్య ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. పాత స్నేహితుల‌ను క‌లుస్తారు. బాధ్య‌త‌లు పెరుగుతాయి.

7. తుల – వీరు ఈ రోజు సుఖ సంతోషాల‌తో గ‌డుపుతారు. జీవిత భాగ‌స్వామి నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి. ఖ‌ర్చులు తగ్గించుకుంటే మంచిది. విలువైన వ‌స్తువును కోల్పోతారు.

8. వృశ్చికం – దాన ధ‌ర్మాలు చేస్తారు. ఇత‌రుల‌కు స‌హాయ ప‌డ‌తారు. మాన‌సికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారంలో జాగ్ర‌త్త వ‌హించాలి. విద్యార్థుల‌కు మంచి జ‌రుగుతుంది. దైవ ద‌ర్శ‌నం చేసుకుంటారు.

9. ధ‌నుస్సు – వీరికి ఈ రోజు కుటుంబంలో అశాంతి ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వ‌స్తాయి. భ‌విష్య‌త్తు బాగుంటుంది. ఉద్యోగులకు ఆశాజ‌న‌కంగా ఉంటుంది.

10. మ‌క‌రం – వీరికి ఈ రోజు ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఇంట్లో ఎవ‌రైనా కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది. ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నుల‌కు దూరంగా ఉంటే మంచిది. కుటుంబంలో సంప‌ద పెరుగుతుంది.

11. కుంభం – పెద్ద మొత్తంలో డ‌బ్బు చేతికి అందుతుంది. సంతానం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంది. అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులు మానుకోండి. స్నేహితుల‌తో గ‌డుపుతారు.

12. మీనం – ఈ రాశి వారు విహార యాత్ర‌ల‌కు ప్లాన్ చేస్తారు. ఒత్తిడిని ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. కుటుంబంలో చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఉద్యోగుల‌కు పొగ‌డ్త‌లు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment