Bandla Ganesh : పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్లగణేష్.. అలాంటి చావు తప్పదంటూ..!

October 1, 2021 10:50 PM

Bandla Ganesh : రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడం చేత పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడులకు దిగారు.

Bandla Ganesh : పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్లగణేష్.. అలాంటి చావు తప్పదంటూ..!

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన దైవంగా భావించే బండ్లగణేష్ తాజాగా పోసాని కృష్ణ మురళిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నచ్చకపోతే ఆయనని తిట్టు, అంతే కానీ ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన కుటుంబం గురించి, ఆయన కుటుంబ సభ్యులను లాగాల్సిన అవసరం లేదనీ ఈ సందర్భంగా బండ్ల గణేష్.. పోసానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పోసాని సినిమా ఇండస్ట్రీలో ఒక ఎక్స్‌పైర్డ్‌ టాబ్లెట్ లాంటి వాడని, అతను పవన్ కళ్యాణ్ లాంటి వారిని విమర్శించడం సరికాదని ఈ సందర్భంగా మాట్లాడారు. భగవంతుడు అనే వాడే ఉంటే పోసాని చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి.. అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బండ్ల గణేష్ మా ఎలక్షన్ ల నుంచి తన నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత ఈ విషయంపై స్పందించడం గమనార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now