shruti hassan : ఆ బెనిఫిట్స్ కోస‌మే అలాంటి సినిమాల్లో న‌టిస్తున్నా.. శృతి హాస‌న్‌..

October 1, 2021 11:24 PM

shruti hassan : దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. శృతి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నటించిన క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలు అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈమెకు మరోసారి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

shruti hassan : ఆ బెనిఫిట్స్ కోస‌మే అలాంటి సినిమాల్లో న‌టిస్తున్నా.. శృతి హాస‌న్‌..

తాజాగా ఈ బ్యూటీ.. ప్రభాస్ సలార్ సినిమా చేయడానికి కారణం ఏంటనే విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం కేవలం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడమెనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ విధమైనటువంటి సినిమాలలో నటించడం వల్ల తనలాంటి హీరోయిన్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని తెలియజేసింది.

ఇలా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కే సినిమాలలో నటించడం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా మనకు పాపులారిటీ దక్కుతుందని.. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే శృతిహాసన్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలిపింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఏ భాషలో కూడా తనకు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వచ్చినా ఏ మాత్రం వదులుకోనని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now