Hari Teja : ఆ కంటెస్టెంట్ టాప్ 5 లో ఉండాలి.. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ..

October 1, 2021 11:04 PM

Hari Teja : ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. మూడు వారాలుగా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 4వ వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు పలువురు సెలబ్రిటీలు వారి మద్దతు తెలుపుతూ వారిని గెలిపించాలని అభిమానులను కోరుతున్నారు.

Hari Teja : ఆ కంటెస్టెంట్ టాప్ 5 లో ఉండాలి.. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ..

కాగా సీనియర్ నటి ప్రియకు గత బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ అఖిల్ తన మద్దతును తెలియజేశారు. అదేవిధంగా మానస్ కి హీరో సందీప్ కిషన్ మద్దతు తెలపగా ప్రియాంక సింగ్ కి నటుడు నాగబాబు మద్దతును తెలియజేశారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆర్జే కాజల్ కి తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ హరితేజ తన మద్దతును తెలియజేసింది.

ఆర్‌జే కాజల్ హౌస్ లో ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుందని, కచ్చితంగా తను హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలబడాలని, అందుకు అభిమానులు పూర్తి మద్దతు తెలియచేయాలని ఈ సందర్భంగా హరితేజ కోరింది. అయితే ఈ వారం నామినేషన్ లిస్టులో ఆర్‌జే కాజల్ ఉండటం గమనార్హం. మరి ఈ వారం ఈ మెసేజ్ జోన్ లో ఉందా లేక డేంజర్ జోన్‌లో ఉందా.. అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment