Pawan Kalyan : పవన్ సినిమాలు ఇకపై థియేటర్‌లలో సందడి చేయవా ?

October 1, 2021 11:31 AM

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక థియేటర్‌లలో సందడి చేయవేమో అన్న అనుమానం రాక మానదు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్లలో విడుదల అయితే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ సినిమాలు ఇకపై థియేటర్‌లలో సందడి చేయవా ?
Pawan Kalyan

ఇలాంటి ఉత్కంఠత పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ తన నిర్మాతలను పిలిచి వారికి కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినిమాలకు ఏపీలో వ్యతిరేకత ఉందంటూ ఆరోపించిన పవన్ కళ్యాణ్.. తాను నటించబోయే సినిమాలకు కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది కనుక తాను నటించే సినిమాలు థియేటర్‌లలోనే కాకుండా ఓటీటీలో మంచి ఆఫర్ వస్తే అక్కడ కూడా విడుదల చేసుకోవచ్చని పవన్ నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టారని.. ఈ సినిమాలన్నీ సుమారు రూ.500 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్లలో తన సినిమాలను విడుదల చేసినా కలెక్షన్లపై పూర్తి ప్రభావం ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ చెప్పినట్టు తన సినిమాలన్నీ థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైతే అభిమానులకి ఇది ఒక పెద్ద షాకింగ్ విషయం అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now