Pushpa : పుష్ప విలన్ మారిపోయాడా.. మరి ఫస్ట్ పార్ట్ లో బన్నీతో తలపడేది ఎవరు ?

September 30, 2021 11:56 PM

Pushpa : ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో పోస్టర్లు, టీజర్, పాటలను విడుదల చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేశారు. తాజాగా ఈ చిత్రంలోని విలక్షణ నటుడి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pushpa : పుష్ప విలన్ మారిపోయాడా.. మరి ఫస్ట్ పార్ట్ లో బన్నీతో తలపడేది ఎవరు ?
Pushpa

ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పోటీ పడటం కోసం మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇతని పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ కి పోటీగా ఫహద్ కనిపించరని, ఇతన్ని చివరిలో ఎంట్రీ ఇస్తూ రెండవ పార్ట్ కీలకంగా మారే సన్నివేశాలలో నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే మరి మొదటి పార్ట్ లో బన్నీతో తలపడేది ఎవరు ? అనే విషయానికి వస్తే..

మొదటి పార్ట్ లో విలన్ పాత్రలో మనకు సునీల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ను ఢీకొట్టిన బోయే విలన్ పాత్రలో సునీల్ నటిస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా ఏ విధంగా ఉండబోతోందనే ఆతృత ప్రేక్షకులలో విపరీతంగా పెరిగిపోయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment