Posani Krishna Murali : బిగ్‌ బ్రేకింగ్‌.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..

September 30, 2021 12:35 PM

Posani Krishna Murali : పవన్ వర్సెస్‌ వైసీపీ నుంచి పవన్‌ వర్సెస్‌ పోసానిగా మారిన మాటల యుద్ధం చివరకు దాడుల వరకు వెళ్లింది. పవన్‌ అభిమానులు పోసానిపై దాడులు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పోసాని ఇంటిపై బుధవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Posani Krishna Murali : బిగ్‌ బ్రేకింగ్‌.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..
Posani Krishna Murali

ఇదే విషయమై పోసాని ఇంటి వాచ్‌ మెన్‌ మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో కొందరు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారని, దీంతో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని అన్నాడు. అయితే ఈ ఘటనపై వాచ్‌మెన్‌ ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Posani Krishna Murali : బిగ్‌ బ్రేకింగ్‌.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..
Posani Krishna Murali Home

దీనిపై స్థానికులు స్పందిస్తూ.. అర్థరాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులే ఈ విధంగా చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. అయితే పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పోసాని అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న తన ఇంట్లో నివాసం ఉండడం లేదని, ఆయన వేరే చోటకు మారారని తెలుస్తోంది.

Posani Krishna Murali : బిగ్‌ బ్రేకింగ్‌.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..
Posani Krishna Murali Home

కాగా పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment