Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ యాంకర్‌ ?

September 30, 2021 1:38 PM

Bigg Boss 5 Telugu : బుల్లితెరపై మూడు వారాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగవ వారం ఎంతో రసవత్తరంగా ప్రసారమవుతుంది బిగ్ బాస్ కార్యక్రమం. 19 మంది కంటెస్టెంట్ లతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్ లో 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన గొడవలు, పోట్లాటలు చోటు చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత వినోదం అందిస్తున్నారు.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ యాంకర్‌ ?
Bigg Boss 5 Telugu

అయితే గత కొద్దిరోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక ప్రముఖ యాంకర్ ను పంపించడం కోసం బిగ్ బాస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన లేడీ యాంకర్ విష్ణు ప్రియను బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించడానికి ఏర్పాటు చేసినట్లు సమాచారం.

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటేనే ఆ కథ వేరేగా ఉంటుంది. అలాంటిది యాంకర్ విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వబోతున్నది అంటే బిగ్ బాస్ లో మరింత సందడి, ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని చెప్పవచ్చు. అయితే విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి బిగ్ బాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment