Chiranjeevi : చిరంజీవి త‌రువాత టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? ఆయ‌న త‌రువాత ఎవ‌రు ఆ పొజిష‌న్‌లో రాణించే అవ‌కాశం ఉంది ?

September 29, 2021 9:55 PM

Chiranjeevi : ఒక‌ప్పుడు ఎన్‌టీఆర్‌, ఏఎన్ఆర్‌, కృష్ణ‌లు.. టాలీవుడ్ సింహ‌స‌నాన్ని ఏలారు. ఒక‌రి మీద ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ సినిమాలు తీస్తూ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచారు. ఆ త‌రువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందింది మెగాస్టార్ చిరంజీవి మాత్ర‌మే అని చెప్ప‌వ‌చ్చు. అయితే చిరంజీవి త‌రం కూడా ఎప్పుడో ఒక‌ప్పుడు ముగియ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఆయ‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్ తేజ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Chiranjeevi : చిరంజీవి త‌రువాత టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? ఆయ‌న త‌రువాత ఎవ‌రు ఆ పొజిష‌న్‌లో రాణించే అవ‌కాశం ఉంది ?
Chiranjeevi

అయితే చిరంజీవి త‌రువాత టాలీవుడ్‌లో ఆ స్థాయి ఆద‌ర‌ణ ఎవ‌రికి ఉంది ? ఎవ‌రు నంబ‌ర్ వ‌న్ కాగ‌ల‌రు ? అన్న విష‌యానికి వ‌స్తే.. ఒక‌ప్పుడు.. అంటే.. మ‌హేష్ బాబు పోకిరి విడుద‌లైన‌ప్ప‌టి ముచ్చ‌ట ఒక‌టి చెప్పాలి. అప్ప‌ట్లో మ‌హేష్ వ‌రుస హిట్‌లో జోరు మీద ఉన్నారు. అయితే విలేక‌రులు కాంట్ర‌వ‌ర్సీ చేయాల‌ని చెప్పి టాలీవుడ్‌లో చిరంజీవి త‌రువాత నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? అని అడిగార‌ట‌. ఈ క్ర‌మంలో మ‌హేష్ ఇందుకు చాలా తెలివిగా స‌మాధానం చెప్పార‌ట‌.

Chiranjeevi : చిరంజీవి త‌రువాత టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? ఆయ‌న త‌రువాత ఎవ‌రు ఆ పొజిష‌న్‌లో రాణించే అవ‌కాశం ఉంది ?
Chiranjeevi Mahesh Babu

చిరంజీవి ఒక లెజెండ్‌. ఆయ‌న‌తో పోటీ ప‌డ‌లేం. కానీ ఆయ‌న త‌రువాత నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? అంటే.. ఎవ‌రైనా కావ‌చ్చు. ఒక శుక్ర‌వారం ఒక‌రు, ఇంకో శుక్ర‌వారం ఇంకొక‌రు. ఇలా నంబ‌ర్ వ‌న్ మారుతుంటారు. అని మ‌హేష్ తెలివిగా స‌మాధానం చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే అప్ప‌ట్లో మ‌హేష్ చెప్పింది నిజ‌మేన‌ని అనిపిస్తుంది.

Chiranjeevi : చిరంజీవి త‌రువాత టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు ? ఆయ‌న త‌రువాత ఎవ‌రు ఆ పొజిష‌న్‌లో రాణించే అవ‌కాశం ఉంది ?
Chiranjeevi Telugu Heroes

అయితే అప్ప‌ట్లో ఒక యువ హీరో వ‌రుస హిట్స్ రాగానే తానే టాలీవుడ్ లో చిరంజీవి త‌రువాత నంబ‌ర్ వ‌న్ అని చెప్పాడ‌ట. కానీ ఫ్లాప్స్ ప‌డే స‌రికి బొక్క బోర్లాప‌డ్డాడ‌ని టాక్ వినిపించింది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ అప్ప‌ట్లో ఇదే విష‌యంపై జోరుగా చ‌ర్చ సాగింది. అయితే ఇప్ప‌టి హీరోలు మాత్రం తామే నంబ‌ర్ వ‌న్ అని అనుకోవ‌డం లేదు. హిట్ కొట్టామా, క‌లెక్ష‌న్లు రాబ‌ట్టామా ? అనేదే చూస్తున్నారు. అలా ఉంటేనే ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉంటుంది. నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ అనేది ఎవ‌రికి వారు డిసైడ్ చేసుకోకూడ‌దు. ఫ్యాన్సే కాలానుగుణంగా నిర్ణ‌యిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now